Home > Life Style > ఈ బెంగళూరు హోటల్‌లో.. పది రకాల ఇడ్లీలు!

ఈ బెంగళూరు హోటల్‌లో.. పది రకాల ఇడ్లీలు!

idliiies-jayanagar

ఉదయాన్నే లేవగాన్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. చేయడం తేలిక, ఆరోగ్య దృష్ట్యా కూడా మంచివనే కారణంతో ఇంట్లో వాళ్లు కూడా టిఫిన్‌గా ఇడ్లీ చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఉదయాన్నే చట్నీలో లేదా కారం పొడిలో ఇడ్లీ నంజుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. వేడి వేడి సాంబర్లో ఇడ్లీ వేసి ఊదుకుంటూ తింటే.. వావ్ అనిపిస్తుంది. నాన్ వెజ్ ప్రియులైతే వీకెండ్లో ఏం చక్కా చికెన్‌తోపాటు లొట్టలేసుకొని తింటుంటారు. తెలుగు వాళ్లు మాత్రమే కాకుండా దక్షిణ భారతీయులు ఇడ్లీని ఎక్కువగా తింటారనే సంగతి తెలిసిందే.

ఇడ్లీల్లోనూ చాలా వెరైటీలు అందుబాటులోకి వచ్చేశాయి. Idliiies పేరిట బెంగళూరులోని జయానగర్లో ఏర్పాటు చేసిన హోటల్లోనైతే పది రకాల వెరైటీలు మన నోరూరిస్తాయి. చాకొలెట్ ఇడ్లీలు, అరటి, బెల్లంతో చేసిన ఇడ్లీలు, మెంతి పన్నీరు ఇడ్లీలు కూడా ఇక్కడ లభిస్తాయి. కొబ్బరి తురుము, అరటి, బెల్లంతో చేసిన ఇడ్లీని ఒకసారి టేస్ట్ చేస్తే వదలబుద్ది కాదు.

ఇవే కాదు కూరగాయలతో చేసిన ఇడ్లీ, ఆలు ఇడ్లీ, తాజా పండ్లతో చేసిన ఇడ్లీల రుచులు భోజన ప్రియుల్ని రారమ్మంటూ స్వాగతం పలుకుతాయి. కాఫీ ఇడ్లీలు కూడా ఇక్కడ లభిస్తాయి. అంతే ఈ ఇడ్లీ ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. మీరు బెంగళూర్లోనే ఉంటున్నా.. ఎప్పుడైనా ఆ సిటీకి వెళ్లినా ఈ ఇడ్లీని టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతకూ అడ్రస్ చెప్పలేదు కదూ.. ఇదిగో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *